గ్రామ వాలంటీర్ అందరికీ గుడ్ న్యూస్ | కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయడానికి యాప్ విడుదల

కొత్త రేషన్ కార్డుల జారీకి కొత్త యాప్…….

అర్హుల దరకాస్తు ప్రక్రియ వాలంటీర్లు ద్వారా నిర్వహణకు యోచన…..

లబ్ధిదారుల అర్హతపై తక్షణమే మొబైల్ కు సందేశం….

ఒక వారం లో వాలంటీర్లకు అందుబాటులోకి రానున్న కొత్త యాప్…..

ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో అర్హత ఉండి కుడా తెల్ల రేషన్ కార్డు లేక ప్రభుత్వ ఫలాలు అందని పరిస్థితి ఈ నేపథ్యంలో అర్హత కలిగిన లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి 5రోజుల్లో రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించింది.

అయితే మీ సేవ ద్వారా పొందాలని చెప్పడంతో మీ సేవ కేంద్రాలకు ప్రజలు క్యూ కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తుండటంతో ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ వాలంటీర్ల ద్వారా చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వం కొత్త యాప్ వినియోగించి సదరు దరఖాస్తు దారుడి ఇంటి వద్దే అర్హత వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేస్తారని తెలుస్తోంది. లబ్దిదారుడి వివరాలు నమోదు చేసిన వెంటనే దరకాస్తు దారుడి మొబైల్ నెంబర్ కు అర్హుడా, అనర్హుడా అనే విషయంపై స్పష్టమైన ఎస్ ఎమ్ ఎస్ రూపంలో సందేశం వస్తుంది. నమోదు అనంతరం అర్హుడుగా మెసేజ్ వస్తే సదరు దరకాస్తు దారుడికి 5రోజుల్లో కొత్త రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈ యాప్ వినియోగం అందుబాటులోకి రావడానికి ఒక వారం పెట్టొచ్చని అధికారులు చెప్తున్నారు.

GSWS DEPARTMENT
COMMISSIONER AP

One thought on “గ్రామ వాలంటీర్ అందరికీ గుడ్ న్యూస్ | కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయడానికి యాప్ విడుదల

  1. Good desision door to door valenteers pablicity cheyali not a political leaders no entry every person s door to s arvy valenteers individual to public avairness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!