Grama Volunteer Tele- conference meeting with Special officer Kannababu

గౌరనీయులైన గ్రామ వార్డ్ స్పెషల్ సెక్రటరీ శ్రీ కన్న బాబు గారు లైవ్ టెలీ కాన్ఫరెన్స్……

ఈ రోజు 19-04-2020 న సాయంత్రం 5గం. లకు…గౌరనీయులైన గ్రామ వార్డ్ స్పెషల్ సెక్రటరీ శ్రీ కన్న బాబు గారు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు ఇచ్చారు.

కన్నబాబు గారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ 👇👇👇

 1. 2nd Phase రేషన్ కార్డు (1000 రు.) లు రేపటి లోగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి వ్యక్తి (రేషన్ కార్డు, ఆధార్ కార్డు ద్వారా సెర్చ్ చేసి ఎలిజిబుల్ అయితే వారికి తప్పకుండ ఆర్ధిక సహాయం (1000 రూ.లు) అందేలా చూడాలి.


గౌరవ ముఖ్యమంత్రిగారి వారి ఆదేశముల మేరకు రెండవ విడత ప్రత్యేక ఆర్ధిక సహాయము మొదటి విడత రెండు రోజులలో జరుగగా రెండవ విడతలో మూడురోజులు అయినప్పటికిని కేవలము ఆరు లక్షలు మందికి మాత్రమే పంపిణీ చేసియున్నారు ఇంకా కొంతమంది వాలంటీర్లు ఇంతవరకు పంపిణీ ప్రారంభించలేదు కావున వెంటనే ఆ పని పూర్తిచేయాలి. 

👇👇👇 Download PDF file 👇👇👇

కన్నబాబు గారు చెప్పిన సూచనలు

 వాలంటీర్ల చేత వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలి. వారి పరిధిలో లేనివి వెల్ఫేర్ వారి లాగిన్ లో ఇవ్వవలెను పోర్టబిలిటిలో కూడ ఇచ్చే అవకాశము ఉన్నందున వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయవలెను ఇది వేగవంతము చెయ్యాలి.గుంటూరు,అనంతపురం,విశాఖపట్నం వారు కొంచెం వేగవంతం చెయ్యాలి. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వాటిని రాష్ట్ర స్ఠాయికి పంపాలి. జిల్లా అధికారులు వెంటనే శ్రద్ద వహించి రేపటిలోగా పూర్తిచేయించవలెను.

 2. ఆరోగ్య సేతు యాప్ ప్రజలందరూ ఇన్స్టాల్ చేసుకునేలా చేయాలి. దాని ద్వారానే సామాన్య ప్రజలు ఆరోగ్య వంతులు ఐన వారికి ఆ యాప్ నుండే ఈ -పాస్ లు పొందేలా తరువాత సూచనలు వస్తాయి.

ఆరోగ్యశ్రీ అప్లికేషన్ విషయంలో ప్రస్తుతము మీరు కోవిడ్ సర్వే ఇప్పటికే చేస్తున్నారు. ఆరోగ్యసేతు అనే అప్లికేషన్ గౌరవ ప్రధానమంత్రి,ముఖ్యమంత్రి గారి వారి ఆదేశముల మేరకు పంచాయతి కార్యదర్సి తప్పని సరిగా స్మార్ట్ ఫోను కలిగిన అందరి చేత డౌన్ లోడ్ చేయించాలి. దీనివలన కుటుంబ సభ్యులకు సెల్ఫ్ ఎసెస్ మెంటు చేసుకొనే అవకాశముంది. ఒకవేళ పాజిటివ్ వస్తే మనకు ముందు జాగ్రత్తగా మనకు రక్షణగా ఉంటుంది. దీనిద్వారా ఎవరు సేఫ్ గాఉన్నారు లాక్ డౌన్ సడలింపులో దీని ప్రకారమే పాస్ లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇది వచ్చే రెండురోజులలో పూర్తి చేయాలి

3. కోవిద్ రాపిడ్ టెస్ట్ యాప్ వాలంటీర్స్ అందరు సర్వే చేసి ప్రజలకు మరిన్ని సూచనల ద్వారా జాగ్రత్త పడేలా చేసేలా చేయాలి.

4. కొత్త రైస్ కార్డు ను స్పందన ద్వారా అప్లై చేయాలి.

5. MCass అందరి వాలంటీర్ మొబైల్స్ లో ఆక్టివేట్ అయ్యేలా చూడాలి.

6. వాలంటీర్ బిల్ల్స్ క్లస్టర్స్ కి మాప్పింగ్ అయిన వారికి మాత్రమే బిల్ల్స్ వచ్చేలా DDO లు చర్యలు చేయాలి.

7. వాలంటీర్ క్లస్టర్ వివరాలు మాదిరి గానే హార్డువేర్ కంపోనేంట్ యొక్క వివరాలు కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. త్వరలో వాటికి సూచనలు వస్తాయి.

 8. వాలంటీర్ రిక్రూట్మెంట్ కొత్తగా డెవలప్ చేసిన వెబ్ ఇంటర్ఫేస్ ద్వారానే అవ్వాలి. అందరికీ తెలిసేలా చేయాలి.
రోజు నుండి వాలంటీర్ల భర్తీ కార్యక్రమము రేపటినుండి ప్రారంభించుటకు మనం నోటిఫికేషన్ మా శాఖద్వారా ఇప్పటికే మీకు మెమోద్వారా తెలియచేసియున్నాము. ఆన్ లైను లో ఉన్నప్రకారము మీకు ఖాళీల వివరములు ఉంచడం జరిగింది వాటికి మాత్రమే ఖాళీలు భర్తీ చేయుటకు చర్యలు తీసుకొనుటజరుగును దానికి సంబందించిన లింకు మీకు పంపబడును టైములైను షెడ్యూలు మెమోలో పూర్తిగా మీకు తెలియచేయుట జరిగినది. డ్యాషు బోర్డు ద్వారా ఈ శాఖ ద్వారా పర్య వేక్షించబడును. దీనిలో క్రొత్త క్లస్టరు ఏర్పాటు ఉండదు కేవలము ప్రస్తుతమున్న ఖాలీలు మాత్రమే భర్తీ చేయబడును.

Leave a Comment

error: Content is protected !!