YSR pension kanuka App v1.4

*వైఎస్ఆర్ పెన్షన్ కానుక:*

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వైఎస్సార్ పెన్షన్ కానుక అప్లికేషన్ V1.4 వెర్షన్ విడుదల చేయడం జరిగినది.

ఇందులో ఇవ్వబడిన సదుపాయాలు.

✅ ఈ అప్లికేషన్ ను play store నుంచి గాని లేదా APOnline మండల కోఆర్డినేటర్ ద్వారా ఇవ్వబడిన Apk ద్వారా గాని install చేసుకోవచ్చు.

Download App :👇👇

YSR pension kanuka V1.4 App

*1.పేమెంట్:* పెన్షన్ పేమెంట్ చేయుటకు ఈ ఆప్షన్ ఓపెన్ చేయవలెను. పోర్టబిలిటీ పేమెంట్ (వేరే సెక్రటేరియట్ సంబంధించిన పింఛను) చేయుటకు పోర్టబిలిటీ ఆప్షన్ లో చేయవలెను. పోర్టబిలిటీ ఆప్షన్ WEA/WDS  login lo మాత్రమే అందుబాటులో ఉంటుంది.

*2. రిపోర్ట్స్:* వాలంటీర్ login lo సంబంధిత పేమెంట్ reports మాత్రమే కనిపిస్తాయి. WEA/WDS login lo సంబంధిత సెక్రేరియట్ వాలంటీర్ మరియు సెక్రటరీ కి సంబందించిన రిపోర్ట్స్ కనిపిస్తాయి.

*3. పెన్షనర్ ఇన్ఫో అప్డేట్:*  పింఛను దారునికి సంబందించిన వివరాలు అప్డేట్ చేయటానికి.
✅ పింఛను పంపిణీ పూర్తయిన తరువాత మిగిలిన పింఛను దారుల ప్రస్తుత స్థితి అప్డేట్ చేయవలెను.
✅ *పోర్టబిలిటీ* : ఇందులో పించనుదారుడు వచ్చే నెలలో వేరే ఊరు లేదా జిల్లాలో పెన్షన్  తీసుకోవాలంటే అప్డేట్ చేయవలెను.
✅ *మైగ్రేషన్* : పించనుదారుడు శాశ్వతముగా వేరే చోట నివసిస్తున్న యెడల పింఛను అక్కడికి బదిలీ చేయుటకు ఇక్కడ అప్డేట్ చేయవలెను.
✅ *అడ్రెస్స్ అప్డేట్* : పించనుదారుని అడ్రెస్స్ మార్చాలన్న ఈ స్క్రీన్ లో అప్డేట్ చేయవలెను.
✅ *మొబైల్ నంబర్ అప్డేట్* పింఛనుదారుని మొబైల్ నంబర్ మార్పు చేయవలసిన యెడల ఇక్కడ అప్డేట్ చేయవలెను.

*4. నోటిికేషన్లు:*  ప్రభుత్వం కానీ ఏపీ ఆన్లైన్ వారు కానీ ఏమైనా సమాచారం ఇవ్వాలంటే దీని ద్వారా తెలియచేస్తారు.

*5. యూజర్ ఇన్ఫో అప్డేట్:* వాలంటీర్ లేకపోయినా లేదా సెలవు పెట్టినా తదితర రిమార్క్ లు ఈ స్క్రీన్ ద్వారా అప్డేట్ చేయవలెను. ఈ స్క్రీన్ WEA/WDS లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రక్రియను ప్రతి నెల 20 తారికు లోపు పూర్తి చెయ్యవలసి ఉంటుంది.

*6. Acquittance:* ఈ నెలలో పెన్షన్ విడుదల చేయబడి వాలంటీర్ లకు  బట్వాడా చేయటానికి ఇచ్చినటువంటి వారి జాబితా ఇందులో PDF ఇవ్వడం జరిగింది. దీనిని సరిచూసుకుంటు పేమెంట్ చెయ్యాలి ఇందులో పెన్షన్ దారుని ఫోటో మరియు వివరములు ఉంటాయి.

*ముఖ్య గమనిక*: *ఏపీ ఆన్లైన్ మండల కోఆర్డినేటర్ కీ ఇంటిమేషన్ లేకుండా App నీ uninstall చెయ్యకూడదు…*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!