గౌరవనీయులైన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు,,,
గ్రామ/వార్డు వాలంటీర్లు…నమస్కరించుకుని వ్రాసుకున్న విన్నపము…
కోవిడ్ 19 కరోణ వైరస్ విజృంభించిన కష్టకాలంలో 5000 రూపాయలకు ప్రాణాలుపొగుట్టుకుంటావా
అని హేళన చేసినా కూడా
మా బిడ్డలను మాకుటుంబాలను వదలి
కష్టపడి ఇల్లు,ఇల్లు వీధి,వీధి తిరిగి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేసాము,
కానీ
ప్రతి ఫలం సెక్రటరీలకు దక్కింది మేము వారిని విమర్శించడం లేదు
గ్రామ/వార్డ్ వాలంటర్ల కు
గుర్తింపు లేకుండాపోయింది
ఎంతటి బాధాకరం,
పెద్దలు ఆలోచించాలి,
పని చేస్తున్న వారికి ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు కల్పించాలి,
అందరికి నాయ్యం చేస్తున గౌరవ శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఒక్కసారి ఆలోచించండి
కేవలం Rs.5000/- రూ. లకి ఇంటర్,మరియు డిగ్రీ, పీజీ చదువులు చదివి
నిరుద్యోగులు గా ఉన్న వారు గ్రామ/వార్డ్ వాలంటీర్లు గా సెలక్ట్ అయినారు అని ఎంతగానో సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మంచి మనసున్న మారాజు మా ముఖ్యమంత్రి జగన్ అన్న అని మా బాధలను అర్థం చేసుకుంటారని ఆశతో
కానీ ఎక్కడ వేసిన
గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉంది,మా గ్రామ/వార్డ్ వాలంటర్లను గుర్తించండి,మాకు నాయ్యం చేయండి.మాకు గౌరవ వేతనం కనీసం 10000 ఇచ్చి,ఇకపై ప్రభుత్వం భర్తీ చేయు ఉద్యోగాలకు ఇప్పుడు పని చేస్తున్న వాలంటీర్లకు ప్రాముఖ్యత ఇవ్వండి లేదా ఉన్నత విద్యార్హత కలిగిన వాలంటీర్లకు పదవ తరగతి తర్వాత నుండి ఒక్కో విద్యార్హతకు 5 మార్కులు కేటాయించి ,లేదా వాలంటీర్లందరికీ 15 మార్కులు ఇచ్చి దానికి తోడు ఇంటర్ కు 5 మార్కులు,డిగ్రీ కు 5 మార్కులు, పీజీ కు 5 మార్కులు ,ఇంకా అదనపు విద్యార్హత ఉంటే వారికి 5 మార్కులు ఇచ్చి మాకు న్యాయము చేయవలసిందిగా కోరుతున్నాము.
ఇట్లు.
గ్రామ/వార్డ్ వాలంటీర్లు
ఆంధ్ర ప్రదేశ్