వైఎస్ఆర్ చేయూత జీవనోపాధిలో పెట్టుకోకపోతే తర్వాత సంవత్సరం డబ్బులు వస్తాయా ? రావా ?

 YSR చేయూత 

Ward Welfare & Development Secretary :-

YSR చేయుత కి సంబంధించి ప్రతి ఒక్క వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి Benificiary Options ను అప్లోడ్ చేయాల్సి ఉంది. 

ముందుగా MEPMA విభాగం నుండి వచ్చిన options form లో వివరాలు సేకరించి రాసుకొని వాటిని వైఎస్సార్ నవశకం ( YSR NAVASAKAM ) లో అప్లోడ్ చెయ్యాలి. 

Download Mepma Option Form 

Jivamopadhi Not Interested Option :-

👉🏻 Final Eligible List లొ ఉన్నవారికి అందరికీ కూడా జీవన ఉపాధి  వివరాలు నమోదు చెయ్యాలి. 

📌 గమనిక :-

ఒకవేళ వారు ఏదైనా ఒక వ్యాపారం చేయుటకు అంగీకారం తెలపక పోతే ఇతరములు క్రింద Not Intrested అని నమోదు చెయ్యండి.

👉🏻 ఎవరు అయితే జీవన ఉపాధి ఆప్షన్ ఇవ్వరో వారికి కేవలం సంవత్సరానికి 18750/- మినహా ఎటువంటి ప్రయోజనాలు కల్పించబడవు ( వ్యాపార రీత్యా ). అంటే ప్రతి సంవత్సరం 18,750 రూపాయిలు వస్తూ ఉంటాయి.

👉🏻ఎవరు అయితే జీవన ఉపాధికీ Yes ఆప్షన్ ఇస్తారో వారికి సంభందిత సంస్థ ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. 

🔴ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి ?

— అతి తక్కువ ధరకే / హోల్ సేల్  ధర కంటే తక్కువ ధరలకే వస్తువులు కొనుగోలు చేసే సౌలభ్యం. దాని ద్వారా సామాన్య వ్యాపారస్తుల కంటే  ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంది అని గ్రహించగలరు.

👉🏻 జీవన ఉపాధి ఆప్షన్స్ ఇచ్చినవారికి  56,250/- loan వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం లిఖిత పూర్వకంగా లోన్ తాలూకా వివరాలు అందుబాటులో లేవు.

📌గమనిక :📌

👉🏻ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి సంవత్సరం 18750/-  అందించడం జరుగుతుంది.

_________________________________________

Leave a Comment

error: Content is protected !!