Rice card E-KYC Problems Solutions | new marriage Person Ration card Problem |

 RICE CARD Faqs

ఈ క్రింది ప్రశ్నలు అడుగుతున్నారు.వాటికి అనుగుణంగా epds dept. గారు ద్వారా ఇచ్చిన సొల్యూషన్స్.

While Doing Rice Card Work you all are facing the below issues.

ప్రశ్న:–  5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కేవైసీ అవసరం లేదు అన్నారు కానీ అలా ఉన్న ఫ్యామిలీ లో కొత్తగా ఇంకొక అబ్బాయి ని యాడ్ చేసేటప్పుడు ఈ కేవైసీ ఫ్యామిలీ మొత్తానికి చేయండి అని వస్తుంది.

సమాధానం :- కుటుంబములో ప్రతీ వ్యక్తికి E-kyc తప్పని సరిగా  చేయించు కోనవలెను. లేని యడల ఏ విధమైన అప్లికేషన్ నమోదు కాబడదు. ఒక వేళ 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కేవైసీ అవ్వని యడల కనీసం ఫెయిల్యూర్ అయిన రావలెను (attempt) తప్పని సరి.

ప్రశ్న:- ఇంటికి వచ్చిన కోడలు తన పుట్టింటి లో తొలగిపోయిన తరువాత వేరొక ఫ్యామిలీలో యాడింగ్ ఎలా సాధ్యపడుతుంది?  అప్పుడు తన పుట్టింటి రైస్ కార్డు నెంబర్ వేయడం సాధ్యం కాదు కదా.

సమాధానం :- వివాహము జరిగిన స్త్రీలు వారి అత్తమామల కార్డు నందు నమోదు కొరకు మాత్రమే దరఖాస్తు చేసుకోన వలెను (డిలీట్ అవసరం లేదు). గ్రామ వార్డు సచివాలయం వెబ్సైటులో రెండు కార్డు నెంబర్లు నమోదు చేసిన యడల సదరు స్త్రీ తన అత్తమామల కార్డు లోకి వచును.

ప్రశ్న:– సిక్స్ స్టెప్ వాలిడేషన్ లో ఇన్ ఎలిజిబుల్ గా ఉన్న వ్యక్తిని తాము ఎలిజిబుల్ మేము సరిచేసుకోవాలి అనుకుంటున్నాము మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు వారినిఎక్కడికి పంపించాలి?  

సమాధానం :- ప్రభుత్వం గతములో INELIGIBLE కార్డుదారులకు ఏ విధమైన అవకాశం కల్పించి యుండలేదు. ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చు వరకు వేచి యుండవలెను.

ప్రశ్న:– ఒక మహిళ పుట్టింటిలో రైస్ కార్డ్ అనేది జనరేట్ కాలేదు అలాంటి వారి పరిస్థితి ఏంటి.  ఆవిడ అత్తగారి కార్డులో యాడింగ్ టైం లో ఇబ్బంది వస్తుంది.

సమాధానం :- వివాహము జరిగిన స్త్రీలు వారి అత్తమామల కార్డు నందు నమోదు కొరకు మాత్రమే దరఖాస్తు చేసుకోను సమయంలో వారి తల్లిదడ్రుల కార్డు లేక పోయిన పరవాలేదు ఎందుకు అనగా రెండవ కార్డు నెంబరు తప్పని సరి కాదు (optional) కనుక ఇబ్బంది ఉండదు.

ప్రశ్న:– ఇంటికి వచ్చిన కోడలు తన భర్త(ఏ కార్డ్ లోని లేని వ్యక్తి) తో కొత్త కార్డు apply చేయడానికి అవ్వటం లేదు. ఎందుకు అంటే ఆ కోడలు తన పుట్టింటి కార్డు లో మెంబెర్ గా ఉంది కనుక.

సమాధానం :-  ప్రభుత్వం ఏ విధమైన అవకాశం కల్పించి యుండలేదు. ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చు వరకు వేచి యుండవలెను.

ప్రశ్న:– 7) Digital Assistant పెట్టిన అప్లికేషన్ VRO స్పందన లో నవశకం కి వస్తుంది. ఫీల్డ్ వేరిఫికేషన్ లో సభ్యుల eKYC చేయాలి అన్నారు. కానీ అప్లికేషన్ ద్వారా generate అయిన ఫామిలీ ID volunteer Aepds app లో ఎంటర్ చేస్తుంటే Card Not Available అని వస్తుంది. ఆ app లో ఏ number తో eKYC చేయాలో తెలుపగలరు.

సమాధానం :- New cards/ adding/ deletion కూడా ekyc తప్పని సరిగా చేయవలెను. అందు అప్లికేషను id ద్వారా మాత్రమే ekyc చేయవలెను. ప్రస్తుతం కొన్ని కార్డులకు ఫామిలీ ID volunteer Aepds app లో ఎంటర్ చేస్తుంటే Card Not Available అని వస్తుంది, దానికి RTGS మరియు NIC వారు పరీక్ష జరుపు చున్నారు. కావున వేచి యుండవలెను.

ప్రశ్న:– కొత్తగా పెళ్లయిన వారికి కొత్త రైస్ కార్డు అప్లై చేస్తున్నప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉమెన్ కాబట్టి భార్య ఆధార్ కార్డు నెంబర్ కొట్టి అప్లై చేస్తున్నాము.  అలా చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ రైస్ కార్డు ఉంది అని రైస్ కార్డు నెంబర్ చూపిస్తుంది.  ఆమె తన తల్లిదండ్రుల కార్డు లో ఉంది కనుక ఆ నంబర్ డిస్ప్లే అవుతుంది. తన భర్త ఏ రైస్ కార్డు లోను లేరు మరియు తన భర్తని తల్లిదండ్రుల కార్డులో  యాడ్ చేయుటకు కూడా వీలు పడటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అప్లైచేయగలమో తెలియజేయగలరు.

సమాధానం :-  ప్రభుత్వం ఏ విధమైన అవకాశం కల్పించి  యుండలేదు. ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చు వరకు వేచి యుండవలెను.

Leave a Comment

error: Content is protected !!