రబీ సీజన్‌లో సాగైన శనగ, పొగాకు, మినుము, వరి తదితర పంటల ఈ క్రాప్ బుకింగ్ జనవరిలో ప్రారంభించారు. సుమారు 3 వేల ఎకరాల్లోని పంట ఈ క్రాప్ బుకింగ్ కాగానే యాప్ మొరాయించింది. ఆ యాప్ సాఫ్ట్‌వేర్ కరప్ట్ అయింది. దీంతో ఈక్రాప్ బుకింగ్ నిలిచిపోయింది. ఇంతలో సంక్రాంతి సెలవులు వచ్చాయి. సాఫ్ట్‌వేర్‌ను సరిచేసుకొని సెలవులు ముగియగానే తిరిగి ఈక్రాప్ బుకింగ్ ప్రారంభించాలని వ్యవసాయ శాఖ అధికారులు భావించారు. ఇంకా మండలంలో సుమారు 17వేల ఎకరాల్లోని పంటల ఈక్రాప్ బుకింగ్ జరగాల్సి ఉంది.సంక్రాంతికి పడిన భారీ వర్షాలతో పంట నష్టాలు
ఈక్రాప్ బుకింగ్ యాప్ సిద్ధంఈక్రాప్ బుకింగ్ యాప్ సాఫ్ట్‌వేర్ తిరిగి వినియోగంలోకి వచ్చింది. అందులో సంక్రాంతికి ముందు నమోదైన వివరాలు గల్లంతుకావడంతో వ్యవసాయశాఖ ఇరుకున పడ్డది. ఇప్పటికే ఈక్రాప్ బుకింగ్ జరిగిన పైర్లు భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వీటిని తీసివేసి ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పాక్షికంగా దెబ్బతిన్న పంటలూ ఉన్నాయి. అందుకే కనిపించకుండా పోయిన వివరాలను తిరిగి రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
సోమవారం నుంచి యథావిధిగా ఈక్రాప్ బుకింగ్ జరుగుతుంది. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలని ప్రభుత్వం పదేపదే సూచించడంతో జిల్లాలో ఈసారి వేరుసెనగ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న, శనగ, కుసుమలు, నువ్వులు తదితర పంటలు సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రస్తుతం ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యంలో యాభై శాతం పూర్తి కావడంతో రైతులు రబీ సాగు పనులు మొదలు పెట్టారు. దీంతో వ్యవసాయ విస్తరణ అధికారులు పొలం బాటపట్టారు. ఇది వరకు రైతులకు సంబంధించి సర్వే నెంబరు, పంటరకం తదితర వివరాలు నమోదు చేయగా ప్రస్తుతం జియో ట్యాగింగ్ చేస్తున్నారు.
పొలాల్లోనే ట్యాబ్‌లతో ఫొటోలు తీసి అక్షాంశాలు, రేఖాంశాలను గుర్తించి, పంట, విస్తీర్ణం, ప్రారంభించిన తేదీ తదితరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేక బృందాలను సైతం నియమించారు. తప్పుడు, పొరపాటు వివరాలు నమోదు చేసినట్లు తేలితే బాధ్యులపై ప్రత్యేక బృందం అధికారులు చర్యలకు సిఫారసు చేయనున్నారు.ఎంతో ప్రయోజనకరం
ఇవీ ప్రయోజనాలు* అధికారులు ఒకచోట కూర్చొని సాగు వివరాల నమోదు చేసే విధానానికి స్వస్తి పలకనున్నారు. దీంతో సరైన వివరాల నమోదుకు వీలుంటుంది. పారదర్శకత ఏర్పడనుంది.