ఈ స్కీమ్ కింద ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే డబ్బులు వస్తాయి. అంటే భార్య, లేదా భర్త ఎవరో ఒకరు ఒకరికి వస్తాయి. ఒక వేళ ఇంట్లో ఇద్దరికి వస్తే మాత్రం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలకు ఇద్దరికీ డబ్బులు వచ్చినట్లయితే ఒకరి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.
అందుకే మీ ఇంట్లో పీఎం కిసాన్ డబ్బులు వస్తే తప్పకుండా ఒకరి డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. లేకుంటే అధికారులు మీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే పలు రాష్ట్రాల్లో వీరిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మీ ఇంట్లో రూ.4వేలు వస్తున్నట్లయితే మీరు స్వచ్చందంగా అధికారులకు తెలియజేసి వెనక్కి ఇచ్చేయడం మంచిది. లేకపోతే మీపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దీని వల్ల మీరు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

పీఎం కిసాన్ యోజనలో
♦️మొదటి అప్‌డేట్:- ఎవరైనా ఇంతకుముందు PM కిసాన్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా వారి ఇన్‌స్టాల్‌మెంట్ స్టేట్‌మెంట్ చూడవచ్చు. కానీ ఇప్పుడు ఇందులో మార్పు చేశారు. ఇప్పుడు మీ స్టేట్‌మెంట్ చూడాలంటే మొదట మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు స్టేట్‌మెంట్‌ని చూడగలరు. దీంతో పాటు మరింత సమాచారాన్ని పొందుతారు.పీఎం కిసాన్ యోజనలో
♦️రెండో అప్‌డేట్:-
రెండో మార్పు ఏంటంటే ఇప్పుడు PM కిసాన్ యోజన లబ్ధిదారులు e-KYC చేయాల్సిన అవసరం తప్పనిసరి. e-KYC చేయని వారి ఖాతాలో 11వ విడత డబ్బులు జమకావు. మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా KYC చేసుకోవచ్చు.
( కేంద్రప్రభుత్వం 11వ విడత పీఎం కిసాన్ యోజనను హోలీ తర్వాత రైతుల ఖాతాలో జమచేసే అవకాశాలు ఉన్నాయి.)
PM కిసాన్ యోజనలో పేరు నమోదు చేసుకున్నట్లయితే 11వ విడత కోసం వేచి ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 2 పెద్ద మార్పులు చేసింది. వీటిని 11వ విడత రాకముందే తెలుసుకోవడం ముఖ్యం.