ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 2000 మూడు విడతలు జారీ చేస్తుంది. ఇప్పటి వరకు 10 వాయిదాల సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసింది. 10వ విడత సొమ్మును ప్రభుత్వం జనవరి 1న బదిలీ చేసింది
11వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి?
పీఎం కిసాన్ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య రైతులకు మొదటి విడత డబ్బులు అందజేస్తామని ప్రభుత్వ తెలిపింది. అదే సమయంలో రెండో విడత డబ్బు ఆగస్టు 1 , నవంబర్ 30 మధ్య బదిలీ అవుతుంది. మూడో విడత డబ్బు డిసెంబర్ 1, మార్చి 31 మధ్య బదిలీ అవుతుంది. ఈ పథకం ప్రయోజనం 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు పొందుతారు. ప్రభుత్వ పెన్షన్ ప్రయోజనం పొందని రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందగలరు. దీంతో పాటు వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. దీంతో పాటుగా కుటుంబంలో ఏ ఇతర వ్యక్తి అంటే భార్య లేదా భర్త ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతుంటే మీరు ఈ పథకానికి అర్హులు కాదు.
మీ ఇన్‌స్టాల్‌మెంట్ తనిఖీ చేయండి
1. ముందుగా http://pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. ఈ వెబ్‌సైట్‌కి కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు మీరు బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.
4. మీ స్టేటస్ చూడటానికి ఆధార్ నంబర్/ మొబైల్ నంబర్/ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎంటర్ చెయ్యాలి.
5. తర్వాత జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు.

రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా మే నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది.
మే 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు.
ఇప్పటి వరకు 10వ విడత జమ కాగా, ఇప్పుడు 11వ విడత నిధులు జమ కానున్నాయి. అయితే ఈ డబ్బులు వచ్చిన తర్వాత జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. పదో విడత జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా, ఇప్పుడు 11వ విడత అందించనుంది. పీఎం కిసాన్ పథకం కింద ఈనెల 31వరకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.