Skip to content

YSR INPUT SUBSIDY PAYMENT STATUS 2022-23 | RYTHU BHAROSA STATUS 2022

దీనివల్ల వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూరింది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేశారు.

ఇలా మొత్తం రూ.571.57 కోట్లను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ అక్షరాల రూ.1,612.62 కోట్లు కావడం గమనార్హం.

ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, శంకరనారాయణ, ఏపీ అగ్రికల్చర్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

2014 ఖరీఫ్‌లో కరువకు 2015 నవంబర్‌లో గాని ఇవ్వలేదు
♦2015 కరువుకు, 2016 నవంబర్‌లోగాని ఇవ్వలేదు
♦2015 నవంబర్, డిసెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన రూ.263 కోట్ల పంట నష్టాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు
♦2016 కరువుకు సంబంధించి 2017 జూన్‌లో ఇచ్చారు
♦2017 కరువుకు సంబంధించి 2018 ఆగస్టులో ఇచ్చారు


♦2018లో ఖరీఫ్‌లో రూ.1,832 కోట్ల పంట నష్టాన్ని, రబీలో జరిగిన రూ.356 కోట్ల పంట నష్టాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు
♦అదికూడా అరకొరగా, కొందరికే ఇచ్చిన పరిపాలనకు, ఇప్పటి పరిపాలనకు తేడా చూడండి
♦కౌలు రైతులను ఎప్పుడూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు

♦మన ప్రభుత్వంలో శాస్త్రీయంగా, అర్హులెవ్వరూ మిగిలిపోకుండా, ఇ-క్రాప్‌ డేటాతో పంట నష్టాలను అంచనావేసి, ఆర్బీకేలస్థాయిలో, గ్రామస్థాయిలో ప్రవేశపెట్టాం
♦తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను ప్రదర్శించి ఏ సీజన్‌లో జరిగిన పంటనష్టానికి అదే సీజన్‌ ముగిసేలోగానే పరిహారాన్ని రైతన్నల ఖాతాల్లో సమచేస్తున్నాం
♦కౌలు రైతులకు సైతం… ఇ-క్రాప్‌ డేటా తీసుకుని వారికి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం


♦ఇలా చేస్తున్నాం కాబట్టే 2020 మారిలో కురిసిన వర్షాలవల్ల నష్టపోయిన రైతులకు 1.56 లక్షల మంది రైతులకు రూ.123.7 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీగా 2020 ఏప్రిల్‌లో అందచేశాం
♦2020 ఏప్రిల్‌ల్‌ నుండి 2020 అక్టోబరు వరకూ కురిసిన నష్టోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ.278.87 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీగా 2020 అక్టోబరులోనే ఇచ్చాం
♦2020 నవంబర్‌లో నివర్‌ సైక్లోన్‌లో దెబ్బతిన్న రూ.8.35 లక్షలమంది రైతులకు రూ.645.99 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీగా 2020 డిసెంబర్‌లోనే అందించాం
♦2021 సెప్టెంబరులో గులాబ్‌ సైక్లోన్‌వల్ల నష్టపోయిన 34,556 మంది రైతులకు రూ.21.96 కోట్ల సహాయాన్ని 2021 నవంబర్‌లో ని అందచేశాం
♦ఏ ఒక్కరు కూడామిస్‌ కాకుండా సహాయాన్ని అందిస్తున్నాం

6 thoughts on “YSR INPUT SUBSIDY PAYMENT STATUS 2022-23 | RYTHU BHAROSA STATUS 2022”

    1. Thanks for Your Comments… Govt of Ap didn’t Relaese any List about input subsidy but in your Sachivalayam/ RBK centers you can check the List …
      Thank You 😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *