ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులకు ఏటా 13500 ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంది.
2022 సంవత్సరంలో మొదటి విడతగా 7500 ప్రతి రైతు ఖాతాలో మే నెలలో జమయ్యాయి ఇప్పుడు రెండో విడతగా మరో నాలుగు వేల రూపాయలు అక్టోబర్ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేయమన్నారు.
ఇందులో పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా రెండు వేల రూపాయలు మరియు వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా మరో రెండు వేల రూపాయలు ఈ రెండు పథకాలు కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి 4000 రూపాయలను జమ చేయనుంది ఏపీ సర్కార్.
ఏపీలో దాదాపుగా 50 లక్షల పైగా రైతాంగానికి ఈ రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయం అనేది నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తూ ఉన్నారు.

ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన వైయస్సార్ రైతు భరోసా రెండో విడత 4000 రూపాయలను రైతులు ఖాతాలోకి జమ చేయనుంది.
ఈ రైతు భరోసా పథకంలో చేరాలంటే ప్రతి ఒక్కరికి కూడా భూమి అనేది కలిగి ఉండాలి గతంలో మీకు డబ్బులు పడకపోయినట్లయితే మీరు మీ వ్యవసాయ అధికారిని లేదా రైతు భరోసా కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చు.
కొత్తగా వైయస్సార్ రైతు భరోసా పథకంలో చేరాలనుకునే రైతులు మీయొక్క బ్యాంకు పాస్బుక్ ఆధార్ కార్డు పొలం పాస్బుక్ ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ అధికారులకు అందజేయవలసి ఉంటుంది.
ఈ వైయస్సార్ రైతు భరోసా పథకం మీకు డబ్బులు వస్తాయా రావా అని తెలుసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ని నమోదు చేస్తే మీకు సంబంధించిన వివరాలనేవి వస్తాయి.
కింద ఉన్న లింకు పై క్లిక్ చేసి రైతు భరోసా పేమెంట్ స్టేటస్ లో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయండి.